కాలానికి లేదే గమ్యం
గతానికి వేశావే గాలం
గెలుపుకై తీయాలి ఈ ప్రయాణం
తలపుకు లేదే మరణం
వూహకెందుకో ఈ భ్రమణం
కంటికి కానరాని ఓ సంచలనం
ప్రాణం తీస్తున్న వాయువై
హృదయాన్ని కోస్తున్న సుఖమై
గరళం లో అమృతం పంచి
జీవితం లో జీవం తెచ్చిన
నా గుప్పెడంత ప్రపంచాన్ని
వెచ్చని నీ ఊపిరితో ప్రాణం పోసి
ఆ ఊపిరే యమ పాశమై నన్ను చుట్టినా
ఆ రెండు అక్షరాల సముద్రాల పున్నమి పోటులా
నన్ను స్తంభింపచేసి పూర్ణమై , సంపూర్ణమై నన్ను
గుందెను త్యజించిన ఆ కెరతాలలనే మరియొక జన్మ గావించగా
నా ఊపిరంత స్వేఛ్చ ని ఆపగలవారింక లేరు..
No comments:
Post a Comment